Nirmal/Khanapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానాలో శుక్రవారం సూపర్డెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ స్వర్ణ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అభినందించారు. దవాఖానాలో మరమ్మత్తులకు గురైన ఎక్స్రే స్కానింగ్ మిషనును పునరుద్ధరించడంతో పాటు, వర్షాకాలంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానాలో శుక్రవారం సూపర్డెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ స్వర్ణ రెడ్డిని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
గత నెలలో దవాఖానాను సందర్శించినప్పుడు మరమ్మత్తులకు గురైన ఎక్స్రే స్కానింగ్ మిషను అధికారులు ఈరోజు మరమ్మత్తులు చేయించి, మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని చైర్మన్ ఈ సందర్భంగా తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా, సీజనల్ వ్యాధులతో దవాఖానాకు వచ్చే రోగులకు తగిన వైద్యం అందించాలని, అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు.
పరిశుభ్రతను పాటించాలని, ఎప్పటికప్పుడు దవాఖానాలను శుభ్రం చేసేలా చూడాలని, దవాఖానాకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుమ్ముల ఆనంద్ కుమార్, ప్రకాష్ గౌడ్, మనోజ్, ఉపేందర్, సురేష్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.











