ఖానాపూర్, జూలై 24
ఖాాూటటణభతవదవాఖాాోూతూంటెండెంటగాడాకటవణెడడశకవాంబాధయతవీకంా.ఈందభంగాఖాాూఅంకంౌకహేందఆెకశభాకాంకషతెా.వషాకాంోీజవయాధకెగవదయేవఅందంాూంా.
ఖానాపూర్ పట్టణ ప్రభుత్వ దవాఖానాలో సూపరింటెండెంట్‌గా డాక్టర్ స్వర్ణ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, గత నెలలో ప్రభుత్వ దవాఖానాను సందర్శించిన సమయంలో మరమ్మత్తులకు గురైన ఎక్స్‌రే స్కానింగ్ యంత్రాన్ని త్వరితగతిన మరమ్మత్తులు చేయించి, తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులతో ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దవాఖానలో పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పాటిస్తూ, పరిసరాలను శుభ్రంగా ఉంచి, ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు గుమ్ముల ఆనంద్ కుమార్, ప్రకాష్ గౌడ్, మనోజ్, ఉపేందర్, సురేష్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.











