"జ్యోతి హాస్పిటల్"లో తొలి ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ విజయవంతం :
👉 *ఆరోగ్యశ్రీ ద్వారా 1 రూపాయి ఖర్చు లేకుండా "ఉచితం"గా బైపాస్ సర్జరీ*
👉 *ఇక హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేదు... జ్యోతి హాస్పిటల్ లోనే గుండె సర్జరీలు*
👉 *30 ఏళ్ల నుండి 24/7 మెరుగైన వైద్య సేవలు జ్యోతి హాస్పిటల్ లోనే సాధ్యం*
మిర్యాలగూడ జూలై 29 (మనోరంజని తెలుగు టైమ్స్)
వైద్యరంగ చరిత్రలో జ్యోతి హాస్పిటల్ మరో అరుదైన రికార్డును సృష్టించింది. తొలిసారిగా అత్యంత క్లిష్టమైన ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ ను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పటివరకు ఇలాంటి చికిత్స కోసం హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది, ఇకనుంచి మిర్యాలగూడ, పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ చికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందరూ ఉన్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో 1996 లో స్థాపించిన జ్యోతి హాస్పిటల్లో అధునాతన మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఏ రకమైన శస్త్ర చికిత్సలను 24 గంటలు మిర్యాలగూడ, పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా 30 ఏళ్లుగామిర్యాలగూడలో నాణ్యమైన వైద్య సేవలుఅందిస్తూఅందరిఆదరాభిమానాలు పొందుతున్నామని జ్యోతి హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సర్జన్ డాక్టర్ మువ్వ రామారావు, కో ఫౌండర్ డాక్టర్ జీవన్ జ్యోతి లు తెలిపారు. బుధవారం జ్యోతి హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రామారావు మాట్లాడుతూ దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన 61 ఏళ్ల మహిళ తీవ్ర గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరగా, వైద్య పరీక్షల్లో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకులు ఉన్నట్లు మా డాక్టర్స్ గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించిన వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా తెలియజేసిన వైద్యులు జూలై 20న కార్డియో థొరాసిక్ సర్జరీ (సి.టి.వి.ఎస్).విభాగం ఆధ్వర్యంలో ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రోగి వేగంగా కోలుకుని 5వ రోజే డిశ్చార్జ్ చేయడం మరొక అద్భుతం అని డాక్టర్స్ ప్రశంశలనుఅందుకున్నారు.ఈ ఖరీదైన చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 1 ఒక రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా అందించడం మరో విశేషంగా చెప్పవచ్చు .ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కూడా అత్యాధునిక గుండె వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ సేవలను అందిస్తున్నట్లు వెల్లడించారు.ఈ శస్త్రచికిత్స కోసం అత్యాధునిక హార్ట్-లంగ్ మెషిన్, హీటర్-కూలర్ సిస్టమ్, మైక్రో కార్డియాక్ ఇన్స్ట్రుమెంట్స్ వినియోగించారు. దాదాపు 25 మందికి పైగా వైద్యులు, అనస్థీషియా నిపుణులు, నర్సింగ్ సిబ్బంది, టెక్నీషియన్లు సమన్వయంతో పనిచేసి ఈ క్లిష్ట ఆపరేషన్ను విజయవంతం చేశారు.శస్త్రచికిత్సలో సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ రమేష్, కార్డియాలజిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి, కార్డియాక్ అనస్థీషియా & క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ లావణ్య కడిమి, డాక్టర్ కృష్ణ చక్ర, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మువ్వా రామారావు, కో-ఫౌండర్ డాక్టర్ జీవన జ్యోతి, డాక్టర్ మువ్వా శ్రీహర్షతో పాటు కార్డియాక్ స్టాఫ్, ఆరోగ్య మిత్రలు, సపోర్ట్ సిబ్బంది కీలక పాత్ర పోషించారు.మిర్యాలగూడతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అత్యాధునిక గుండె వైద్యసేవలను అందించాలన్న సంకల్పంతోనే ఈ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.జ్యోతి హాస్పిటల్ లో 4 కోట్ల రూపాయలతో అత్యాధునిక వైద్య పరికరాలతో ఆపరేషన్ రూమ్ అందుబాటులో ఉందన్నారు. హాస్పిటల్ ఏర్పాటు చేసిన 1996 సంవత్సరంలోనే నాలుగు వెంటిలేటర్స్ సౌకర్యంతో మెరుగైన వైద్య సేవలను ప్రారంభించామని, 1998 సంవత్సరంలో 5 లక్షల,80 వేల రూపాయలతో బ్లడ్ బ్యాంక్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన తదుపరి నుంచి నేటి వరకు రక్తం దొరకక రోగి చనిపోయినదాఖలాలు లేవన్నారు. మా హాస్పిటల్ లకు పిఆర్వోలు లేరని స్పష్టం చేశారు. 100 పడకల ఆసుపత్రి 30 మంది డాక్టర్లు, 170 పైగా స్టాఫ్ తో 24 గంటలు నాణ్యమైన వైద్య సేవలుఅందిస్తున్నామని డాక్టర్ మువ్వా రామారావు తెలిపారు. ప్రజల విశ్వాసం, సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలనువిస్తరించనున్నట్లు ఆయన వివరించారు.












