న్యూఢిల్లీ, 2026-08-23
ఢిల్లీ ఆగస్టు 23 విస్తరిస్తోంది.ురంజని తెలుగు టైమ్స్ ఢిల్లీ ఆగస్టు 23 విస్తరిస్తోంది.ురంజని తెలుగు టైమ్స్ ప్యాక్ విస్తరిస్తున్న నేపథ్యంలో, వాటి ఆరోగ్యంపై చూపే మార్కెట్లోంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో నేపథ్యంలో, 23 లభించే ఆరోగ్య హెచ్చరికలను తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ()లను ఆదేశించింది.
ఢిల్లీ ఆగస్టు 23 మనురంజని తెలుగు టైమ్స్ ప్యాక్ చేసిన ఆహార పదార్థాల మార్కెట్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఆధునిక జీవనశైలిలో భాగమైన ఈ ఆహారం మన ఆరోగ్యంపై, ముఖ్యంగా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందనేది చర్చనీయాంశంగా మారింది. నేడు మార్కెట్లో లభించే అత్యధిక శాతం ప్రాసెస్ చేసిన ఆహార ప్యాకెట్లపై షుగర్ ఫ్రీ, సహజమైనది, కొలెస్ట్రాల్ ఫ్రీ, లేదా పోషకాలతో కూడినది అని ఆకర్షణీయమైన అక్షరాలతో ప్రచారం చేస్తుంటారు. కానీ నిజానికి ప్యాకెట్ వెనుక భాగంలో అతి చిన్న అక్షరాలతో ముద్రించే సమాచారాన్ని పరిశీలిస్తే... అందులో అధిక మొత్తంలో సేచురేటెడ్ కొవ్వులు, చక్కెర, అధిక ఉప్పు ఉన్నట్లు స్పష్టమవుతుంది. సాధారణ వినియోగదారుడికి ఈ సాంకేతిక పరిభాష లేదా చిన్న అక్షరాలను చదివి అర్థం చేసుకునే అవకాశం కానీ, సమయం కానీ ఉండదు. ఫలితంగా ఆరోగ్యకరమైనది అని భావించి కొనుగోలు చేసే ఉత్పత్తులే స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బుల వంటి వ్యాధులకు దారితీస్తున్నాయి.
యునిసెఫ్ హెచ్చరికలు
రంగురంగుల ప్రచారాలతో పిల్లలను ఆకర్షించే అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల వెనుక ఉన్న నిజమైన ప్రమాదాలను తల్లిదండ్రులకు స్పష్టంగా తెలియజెప్పేలా ప్యాకెట్లపై హెచ్చరికలు ఉండాలి. పిల్లల పోషకాహార రక్షణకు ఇది ప్రాథమిక సూత్రం అని యునిసెఫ్ చాలాకాలంగా హెచ్చరిస్తోంది. వాస్తవానికి ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లపై ఆరోగ్య హెచ్చరికలను ప్రముఖంగా ముద్రించాల్సి ఉంది. వ్యాపార సంస్థలు గానీ, ప్రభుత్వాలుగానీ దీనిని చూసీచూడనట్లే వ్యవహరిస్తున్నాయి.
ఆరోగ్య హక్కుపై సుప్రీంకోర్టు స్పందన
మన చేతుల్లోకి వచ్చే ప్రతి ప్యాకెట్ ఆహారం... మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కానీ ఆ ప్యాకెట్‌పై ఉండే పోషక విలువల పట్టికను చూస్తే సాధారణ వినియోగదారుడికి అర్థమయ్యేది ఎంత స్పష్టమైన ఆరోగ్య హెచ్చరికల లేబుళ్లను తీసుకురావడంపై దాదాపు దశాబ్ద కాలంగా చర్చలు జరుగుతున్నప్పటికీ, అమలు మాత్రం ఆలస్యమౌతూనే ఉంది. ఈ జాప్యంపై అత్యున్నత న్యాయస్థానం తాజాగా కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వినియోగదారుల ఆరోగ్య హక్కు... వాణిజ్య ప్రయోజనాల కంటే మిన్న అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం.
రాజ్యాంగం కల్పించిన హక్కు
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నది ప్రభుత్వ విధానాల ప్రాథమిక లక్ష్యం కావాలి. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21లో జీవించే హక్కుతో పాటు ఆరోగ్యంగా ఉండే హక్కు కూడా అంతర్భాగం. ప్రాసెస్డ్ ఫుడ్, కంపెనీల మాయాజాలంపై ఆహార పరిశ్రమ మనల్ని పోషించడానికి ప్రయత్నించడం లేదు, అది మనల్ని వ్యసనపరులుగా మార్చడానికి ప్రయత్నిస్తోంది అంటారు ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ మార్క్ హైమన్. కనుక ప్రజల ఆరోగ్యానికి వ్యాపార ప్రయోజనాలు అడ్డంకి కాకూడదు.












