నిర్మల్ జిల్లా కేంద్రంలో 108 అంబులెన్స్ సేవల పనితీరును మెరుగుపరిచేందుకు అధికారులు బుధవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్–నిర్మల్ జోన్ 108 అంబులెన్స్ ప్రాజెక్టు మేనేజర్ ఎన్. జనార్దన్, నిర్మల్ ఇంచార్జ్ ఈఎంఈ డి. లింగాచారి ఈ తనిఖీలకు హాజరయ్యారు.
ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని అంబులెన్స్‌లను పరిశీలించిన అధికారులు, వాటిలో అత్యవసర మందులు, వైద్య పరికరాల లభ్యత, నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. అంబులెన్స్‌ల సాంకేతిక నిర్వహణ స్థితిగతులపై కూడా సమీక్షించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించడంలో సిబ్బంది అప్రమత్తత, సేవల నాణ్యతపై అధికారులు దృష్టి సారించారు. మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ తనిఖీల్లో సారంగాపూర్ 108 అంబులెన్స్ సిబ్బంది ప్రభాకర్, పైలట్ మహేష్ పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన, సమర్థవంతమైన అత్యవసర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.











