కుబీర్ మండలానికి చెందిన జాదవ్ మాధవ్ రావు చేపట్టిన ద్వాదశ జ్యోతిర్లింగాల పాదయాత్రకు మద్దతుగా జిడిఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మందుల పంపిణీ జరిగింది. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ పాదయాత్రికునికి అవసరమైన మందులను అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని సూచించారు. మాధవరావు చేపట్టిన పాదయాత్ర గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని, అఖండ భారత్ అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తూ సాగుతోందని తెలిపారు.
పాదయాత్ర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అకౌంటెంట్ జాధవ్ పుండలిక్ రావు, మరాఠా నాయకులు కంఠాళే రఘువీర్ పాటిల్, వీఆర్వో సాయినాథ్, శంకర్, ప్రసాద్, సూర్యనారాయణ పాటిల్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
జిడిఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రజల సంక్షేమానికి, సామాజిక సేవకు కట్టుబడి ఉందని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. సమాజంలో సేవా దృక్పథంతో ముందుకు సాగడం ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు.








