తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం

Tirumala Ghat Road Accident With Injured Devotees
  • సుమో వాహనం బోల్తా కొట్టింది
  • భక్తులకు గాయాలు
  • రుయా ఆసుపత్రికి తరలింపు

 

తిరుమల ఘాట్ రోడ్డులో ఓ సుమో వాహనం పల్టీ కొట్టిన ఘటనలో భక్తులకు గాయాలు అయ్యాయి. ఈ సంఘటన ఇవాళ ఉదయం, తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో 24వ మలుపు వద్ద జరిగింది. భక్తులను వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు. అదుపు తప్పడం, అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

 

తిరుపతి: అక్టోబర్ 23

తిరుమల ఘాట్ రోడ్డులో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం భక్తులలో ఆందోళన కలిగించింది. సుమో వాహనం 24వ మలుపు వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో వాహనంలో ఉన్న భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం, వాహనం అతివేగంగా నడిపినందువల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment