యాదాద్రి భువనగిరి, 3 September
లో తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, నీటి విలువను గుర్తించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీమతి మంజుల పత్తిపాటి హెచ్చరించారు. నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఆమె తన సందేశాన్ని వెలువరించారు.
నీటి యుద్ధం మొదలైంది.. మేల్కొందామా?
— మంజుల పత్తిపాటి
యాదాద్రి భువనగిరి జిల్లా: నీటి విలువను గుర్తించకపోతే భవిష్యత్తులో తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీమతి మంజుల పత్తిపాటి హెచ్చరించారు. నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఆమె తన సందేశాన్ని వెలువరించారు.
“నీటి యుద్ధాలు రాలేదా? రాలేదంటారా? చెప్పండి!” అంటూ ప్రజలను ఆలోచింపజేసేలా ప్రశ్నించారు. నీటి విలువ తెలియని పరిస్థితుల్లో బాటిల్లో నీటిని కొనుగోలు చేస్తున్నామని, నీరు సహజ వనరు అయినప్పటికీ దాని కోసం డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు.
నదులను ఆక్రమించడం, చెరువులను పూడ్చివేయడం, భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం ద్వారా ప్రకృతి ఒడిని ఖాళీ చేస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భూతాపం పెరుగుతున్న పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
“ఒక్క మొక్క నాటండి.. ఒక్క చెట్టును కాపాడండి.. ఒక్క చుక్క నీటిని ఆదా చేయండి” అని ఆమె సూచించారు. ఈరోజు ఒక మొక్కకు నీరు పోస్తే రేపు మనిషికి నీరు దొరుకుతుందని, భవిష్యత్ తరాలకు నీడతో పాటు నీటిని అందించేందుకు ఇప్పటి నుంచే ప్రకృతిని కాపాడాలని కోరారు.
“భవిష్యత్తుకు నీడనివ్వండి.. భవిష్యత్తుకు నీరునివ్వండి” అంటూ మంజుల పత్తిపాటి ప్రజలకు సందేశం ఇచ్చారు.
రచన: శ్రీమతి మంజుల పత్తిపాటి ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం











