ముధోల్, జూలై 9
ముధోల్ మండలంలోని విట్టోలి గ్రామ పంచాయతీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబానికి ఆరు మొక్కలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ రుచిత దిగంబర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు మొక్కలు అందజేశారు.
ముధోల్ మండలంలోని విట్టోలి గ్రామ పంచాయతీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబానికి ఆరు మొక్కలను పంపిణీ చేశారు.
గ్రామ సర్పంచ్ రుచిత దిగంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రతి కుటుంబం అందజేసిన ఆరు మొక్కలను తప్పనిసరిగా నాటి వాటిని సంరక్షించాలని కోరారు. మొక్కల పెంపకంతో గ్రామంలో పచ్చదనం పెంపొందడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












