కుంటాల, 2023-09-01
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కుంటాల గ్రామ సర్పంచ్ జక్కుల గజేందర్ చేపట్టిన స్టీల్ బ్యాంక్ ఏర్పాటుకు విశేష స్పందన లభిస్తోంది. గ్రామంలో జరిగే శుభకార్యాలు, సామూహిక కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులకు బదులుగా స్టీల్ సామగ్రిని వినియోగించాలన్న సర్పంచ్ పిలుపునకు పలువురు దాతలు స్పందించారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కుంటాల గ్రామ సర్పంచ్ జక్కుల గజేందర్ చేపట్టిన స్టీల్ బ్యాంక్ ఏర్పాటుకు విశేష స్పందన లభిస్తోంది. గ్రామంలో జరిగే శుభకార్యాలు, సామూహిక కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులకు బదులుగా స్టీల్ సామగ్రిని వినియోగించాలన్న సర్పంచ్ పిలుపునకు పలువురు దాతలు స్పందించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులకు స్పందిస్తూ ప్లాస్టిక్ నిషేధంలో మేము సైతం అంటూ విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారు.
దాతల విరాళాలు
ఇప్పటికే మానాజీగారి సిద్ధిరామ్ (టీచర్) 200 ప్లేట్లు, 100 గ్లాసులు; తగలపల్లి లావణ్యనరేందర్ (టీచర్) 100 ప్లేట్లు, 50 గ్లాసులు; మేసినేని వెంగల్ రావుశ్రవణ్ రావు సోదరులు 100 గ్లాసులు; సోమ రాములు 50 ప్లేట్లు; సక్రపు గజేందర్ (టీచర్) 100 ప్లేట్లు; తోట గజ్జరాం 100 ప్లేట్లు; సదాశివ్ పటేల్ (బోర్వెల్) 100 ప్లేట్లు; ఓడ్నం రాము 100 ప్లేట్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
స్టీల్ బ్యాంక్ ఏర్పాటుకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని సర్పంచ్ జక్కుల గజేందర్ తెలిపారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మరింత మంది దాతలు ముందుకొచ్చి స్టీల్ ప్లేట్లు, గ్లాసులు విరాళంగా అందించాలని పిలుపునిచ్చారు. స్టీల్ బ్యాంక్‌లో భాగస్వామ్యం కావాలనుకునే వారు సర్పంచ్ జక్కుల గజేందర్‌ను 9553632650 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.












