సూర్యాపేట, జూలై 29
దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంబి మండలంలోని కోసగుట్ట ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంబి మండలంలోని కోసగుట్ట ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పెంబి రేంజ్ అటవీ క్షేత్ర అధికారి శ్రీమతి రాథోడ్ కల్పనా దేవి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా పులుల సంరక్షణ, వాటి సహజ ఆవాసాల పరిరక్షణ, అక్రమ వేట నిర్మూలనతో పాటు జీవవైవిధ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. 2010లో ఈ దినోత్సవానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "పులి ఉంటేనే అడవి ఉంటుంది... అడవి ఉంటేనే ప్రకృతి సమతుల్యం ఉంటుంది. మన జాతీయ సంపద అయిన పులులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పులులను కాపాడుదాం... ప్రకృతిని పరిరక్షిద్దాం!" అని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ వెంకట్రావు, ఉపాధ్యాయులు, K. ప్రతాప్ నాయక్ (డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఇటిక్యాల), M. గీత (డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ధూమ్ధారి), A. సుందర్ (FSO), A. నరేష్ (FBO), ఆశిష్ (FBO), లెనిన్ (FBO), గంగారం (FBO), లాలాజీ (FBO) తదితరులు పాల్గొన్నారు.












