Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్ గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా బోర్వెల్ రీఛార్జ్ గుంత ఏర్పాటుకు ఈరోజు మార్కింగ్ చేపట్టారు. భూగర్భ జలాలను పరిరక్షించడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం ద్వారా బోర్వెల్లలో నీటి మట్టాన్ని పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్ గ్రామపంచాయతీలో బోర్వెల్ రీఛార్జ్ గుంత ఏర్పాటుకు ఈరోజు మార్కింగ్ చేపట్టారు. భూగర్భ జలాలను పరిరక్షించడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం ద్వారా బోర్వెల్లలో నీటి మట్టాన్ని పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, ఇంచార్జ్ ఏపీవో అనిల్, ఏపీఎం భోజన్న, గ్రామ సర్పంచ్ దోమల భోజన్న, ఉపసర్పంచ్ నాగమణి, గ్రామ పంచాయతీ కార్యదర్శి శైలజ, టీఏ రవీందర్, సీసీ మహేందర్, వీవోఏ, ఫీల్డ్ అసిస్టెంట్ మహేష్ గౌడ్, సుమన్, శ్రీధర్ రెడ్డి, గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, బోర్వెల్ రీఛార్జ్ గుంతల ఏర్పాటు వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని తెలిపారు. రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామ ప్రజలు జల సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.












