Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలని ఎంపీడీవో లక్ష్మీకాంతారావు, ఎంపిఓ అజీజ్ ఖాన్ లు సూచించారు. 'వికసిత్ భారత్ - రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్' గ్రామీణ పథకం కింద 'వర్షపు బొట్టు ఒడిసిపట్టు' నినాదంతో 'జలశ్రీ - నీటి సంరక్షణ నిర్మాణాలు' భాగంగా గురువారం గోపాల్ పెట్, స్వర్ణ, బీరవెల్లి, రామ్ సింగ్ తండా గ్రామాల్లో ఈ పనులు ప్రారంభమయ్యాయి.
ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలని ఎంపీడీవో లక్ష్మీకాంతారావు, ఎంపిఓ అజీజ్ ఖాన్ లు సూచించారు. గురువారం గోపాల్ పెట్, స్వర్ణ, బీరవెల్లి, రామ్ సింగ్ తండా గ్రామాల్లో 'వికసిత్ భారత్ - రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్' గ్రామీణ పథకం కింద 'వర్షపు బొట్టు ఒడిసిపట్టు' నినాదంతో 'జలశ్రీ - నీటి సంరక్షణ నిర్మాణాలు' భాగంగా ఈ పనులను ప్రారంభించారు.
ఈ పథకం కింద వ్యవసాయ భూముల్లో నీటి గుంట, గ్రామాల్లో కుటుంబానికి ఇంకుడు గుంత, ప్రతి ఊరిలో ఊట కుంట, చేతి పంపు వద్ద ఇంకుడు గుంత, మురికి కాలువల చివరన ఇంకుడు గుంతల నిర్మాణానికి అధికారులు మార్కోట్ ఇచ్చి పనులు ప్రారంభించారు. ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్లు గంగారెడ్డి, మల్లేష్, గంగవ్వ, రజిత, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.












