Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
లోకేశ్వరం మండలంలోని గోడిసెరా గ్రామపంచాయతీలో 'జలసిరి' కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో నీటి సంరక్షణ ఆవశ్యకతను, భూగర్భ జలాల పెంపునకు చేపట్టాల్సిన చర్యలను గ్రామస్తులకు వివరించారు. ఫాంపాండ్ల నిర్మాణం, బోర్వెల్ రీఛార్జ్ వంటి పద్ధతులపై అవగాహన కల్పించారు.
లోకేశ్వరం మండలంలోని గోడిసెరా గ్రామపంచాయతీలో 'జలసిరి' కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారి మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి చేనులో ఫాంపాండ్, ప్రతి ఇంటికి మ్యాజిక్ సో ఫీట్లు, బోర్వెల్ రీఛార్జ్ వ్యవస్థ ఏర్పాటుతో భూగర్భ జలాలను పెంపొందించి నీటి కొరతను అధికమించాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
వర్షపు నీటిని వృధా కాకుండా భూమిలోకి ఇంకించే చర్యలను ప్రతి ఒక్కరూ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి సల్మాన్ రాజ్, గ్రామపంచాయతీ సర్పంచ్ జంగం ప్రసన్న వినోద్, ఉపసర్పంచ్ లక్ష్మి, పంచాయతీ సెక్రెటరీ భాస్కర్ గౌడ్, టి.ఎ. శారద, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్, వార్డ్ మెంబర్లు, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.












