వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2026 సందర్భంగా జైపూర్ గ్రామపంచాయతీలో 'స్వచ్ఛ జ్ఞాన్ సురక్షిత్ జలవాయు' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపూరావు ఈ కార్యక్రమానికి హాజరై, పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
ప్రజలందరిచేత స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రత్యేక ర్యాలీని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.












