ఖానాపూర్, 2026-08-05
బోధనోపకరణాలతో (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ - టీఎల్ఎం) బోధిస్తే విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకుంటారని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పొద్దుటూరి మమత అన్నారు. ఖానాపూర్, ఆగస్టు 5 (మనోరంజని తెలుగు టైమ్స్): తరగతి గదిలో ప్రతి ఉపాధ్యాయుడు బోధనోపకరణాలను ఉపయోగించి బోధించినట్లయితే, విద్యార్థులు పాఠ్యాంశానికి సంబంధించిన వివిధ రంగుల టీఎల్ఎంను పరిశీలించి, తాము బోధించే విషయాన్ని సులభంగా అవగాహన చేసుకుంటారని ఆమె తెలిపారు.
బోధనోపకరణాలతో (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ - టీఎల్ఎం) బోధిస్తే విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకుంటారని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పొద్దుటూరి మమత అన్నారు. ఖానాపూర్, ఆగస్టు 5 (మనోరంజని తెలుగు టైమ్స్): తరగతి గదిలో ప్రతి ఉపాధ్యాయుడు బోధనోపకరణాలను ఉపయోగించి బోధించినట్లయితే, విద్యార్థులు పాఠ్యాంశానికి సంబంధించిన వివిధ రంగుల టీఎల్ఎంను పరిశీలించి, తాము బోధించే విషయాన్ని సులభంగా అవగాహన చేసుకుంటారని జెడ్పీఎస్ఎస్ సత్తెనపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పొద్దుటూరి మమత తెలిపారు.
జీవశాస్త్రం కాంప్లెక్స్ సమావేశంలో సోమవారం ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయుడు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వంచే కల్పించిన శిక్షణ తరగతులలో పొందిన మెలకువలు, సోపానాలను పిల్లల బోధనలో కచ్చితంగా ఉపయోగించాలని ఆమె సూచించారు. సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులకు టీఎల్ఎంను ఉపయోగించి పాఠాలు బోధిస్తే, వారికి సులభంగా అర్థమవుతాయని, తద్వారా లెర్నింగ్ అవుట్ కమ్స్ (అభ్యసన ఫలితాలు) సాధించవచ్చని ఆమె అన్నారు.
ఈ సమావేశంలో వివిధ పాఠశాలలకు చెందిన బయో సైన్స్ టీచర్లు తమ పాఠశాలలో బోధనా పద్ధతులు, ఇటీవల నిర్వహించిన బేస్ లైన్ టెస్ట్ గ్రేడింగ్ వివరాలు, తక్కువ గ్రేడ్ గల విద్యార్థులకు ఎలా బోధిస్తున్నారో తెలియజేశారు. రిసోర్స్ పర్సన్ విజయ్ కుమార్, పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) గురించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ సుష్మ రాణి, నర్సయ్య, విజయ్ కుమార్, కవితతో పాటు ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరాబాద్ మండలాలకు చెందిన జీవశాస్త్రం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












