నిజామాబాద్, 2026-06-05
నిజామాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ టి. శ్రీనివాస్‌పై ఆర్థిక, పరిపాలనాపరమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, వయస్సు నిబంధనలను అతిక్రమించి ఆయనను జపాన్ విద్యా పర్యటనకు ఎంపిక చేయడాన్ని రద్దు చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
నిజామాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ టి. శ్రీనివాస్‌పై ఆర్థిక, పరిపాలనాపరమైన ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నప్పటికీ, వయస్సు నిబంధనలను అతిక్రమించి ఆయనను జపాన్ విద్యా పర్యటనకు ఎంపిక చేయడాన్ని రద్దు చేయాలని విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కర్క గణేష్ మాట్లాడుతూ, డైట్ ప్రిన్సిపాల్‌పై సుమారు రూ.30 లక్షల నిధుల దుర్వినియోగం, విద్యార్థులకు ఇబ్బందులు కలిగించారనే ఫిర్యాదులు వంటి అంశాలపై ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఆరోపణలు వాస్తవమా కాదా అనేది సమగ్ర విచారణ, ఆర్థిక ఆడిట్ ద్వారా తేల్చాలని ఆయన అన్నారు.
విచారణ పూర్తికాకముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని జపాన్ విద్యా పర్యటనకు ఎంపిక చేయడం ఎలా సాధ్యమైందని ఆయన ప్రశ్నించారు. జపాన్ విద్యా పర్యటనకు 55 సంవత్సరాలు లోపు ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ, 60 సంవత్సరాలు నిండిన డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌ను ఎలా ఎంపిక చేశారని ఆయన ప్రశ్నించారు. విద్యా పర్యటనల ఉద్దేశ్యం వ్యక్తిగత ప్రయోజనం కాదని, వాటి ద్వారా పొందే అనుభవం విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉండాలని ఆయన అన్నారు.
ఎంపికలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని, ఎంపికను పునఃపరిశీలించి అర్హత కలిగిన సిబ్బందికి అవకాశం కల్పించాలని వారు కోరారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, ప్రిన్సిపాల్‌పై ఉన్న ఆరోపణలపై సమగ్ర విచారణ పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి అల్గోట్ సృజన్, నాయకులు శ్రీశాంత్, తదితరులు పాల్గొన్నారు.












