నిర్మల్, 2026-08-31
నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఏకలవ్య ఫౌండేషన్, దివ్యాంగ శక్తి ఫౌండేషన్విద్యావాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా, మంజులాపూర్ పాఠశాలలో జరిగిన చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులకు సోమవారం బహుమతులు అందజేశారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఏకలవ్య ఫౌండేషన్, దివ్యాంగ శక్తి ఫౌండేషన్విద్యావాహిని ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గత జులై నెలలో మంజులాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులకు సోమవారం బహుమతులు అందజేశారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంజులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని కార్యక్రమాలకు శ్రీమతి పద్మ మండల విద్యాధికారి దాతగా వ్యవహరించనున్నట్లు ఏకలవ్య ఫౌండేషన్ కోఆర్డినేటర్ చిన్నయ్య తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక కల్పించడమే ఫౌండేషన్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ఛైర్మన్ మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












