ముధోల్, 2026-06-05
ముధోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణానికి రక్షణ గోడ (కాంపౌండ్ వాల్) నిర్మించాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం () నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ ()కు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల భద్రత, విద్యా వాతావరణం మెరుగుపరచాలని కోరారు.
ముధోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణానికి రక్షణ గోడ (కాంపౌండ్ వాల్) నిర్మించేలా సంబంధిత అధికారులను ఆదేశించి, నిధులు మంజూరు చేయాలని కోరుతూ అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం () నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ ()కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ మాట్లాడుతూ... కళాశాల చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రక్షణ గోడ లేకపోవడంతో బయటి వ్యక్తులు, అసంబంధిత వ్యక్తులు యథేచ్ఛగా కళాశాల ఆవరణలోకి వస్తున్నారని, దీనివల్ల ముఖ్యంగా విద్యార్థినుల భద్రతకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
తరగతులు జరుగుతున్న సమయంలో బయటి వ్యక్తుల సంచారం వలన విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతిని ప్రశాంతమైన విద్యా వాతావరణం కొరవడుతోందని, కళాశాల సమయం ముగిసిన తర్వాత, రాత్రి వేళల్లో, సెలవు రోజుల్లో ఈ ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కళాశాల ప్రిన్సిపాల్ కూడా కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల నిత్యం ఎదురవుతున్న తీవ్రమైన భద్రతా సమస్యలను ధృవీకరించారని ఆయన గుర్తుచేశారు.
కావున, సబ్ కలెక్టర్ వెంటనే స్పందించి, విద్యార్థుల భద్రత, కళాశాల రక్షణను దృష్టిలో ఉంచుకొని ముధోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి, పనులు తక్షణమే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












