నిర్మల్, జూలై 7
నిర్మల్ జిల్లా సిర్గాపూర్‌లోని శిశు మందిర్ విద్యాలయానికి రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి 4 ఎకరాల భూమిని విరాళంగా అందించారు. ఈ భూదానం వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అవుతుందని పలువురు పేర్కొన్నారు. విద్యాసేవకు మద్దతు ప్రకటించిన వెంకట్ రమణారెడ్డిని కూడా అభినందించారు.
నిర్మల్ జిల్లా సిర్గాపూర్‌లోని శిశు మందిర్ విద్యాలయానికి 4 ఎకరాల భూమిని విరాళంగా అందించిన రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.
భారతీయ సంస్కృతి, సనాతన విలువలు, దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో భావితరాలను తీర్చిదిద్దుతున్న శిశు మందిర్ వంటి విద్యాసంస్థకు అందించిన ఈ భూదానం వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు.
అలాగే ఈ మహోన్నత నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేస్తూ విద్యాసేవకు తన పూర్తి మద్దతు ప్రకటించిన వెంకట్ రమణారెడ్డిని కూడా ప్రత్యేకంగా అభినందించారు.
"విద్యాదానం సర్వదానాలలో శ్రేష్ఠమైనది" అనే భారతీయ సంప్రదాయాన్ని ఆచరణలో చూపిన ఈ సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలిచి, మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి, వెంకట్ రమణారెడ్డికి మరోసారి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.












