మిర్యాలగూడ, జులై 6
జర్నలిస్టు కుటుంబాల పిల్లలకు పాఠశాలల్లో ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ మిర్యాలగూడలో నిరసన ధర్నా జరిగింది. టీయూడబ్ల్యూజే (ఐజేయు) నల్లగొండ జిల్లా కమిటీ పిలుపు మేరకు సోమవారం స్థానిక సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఈ నిరసన చేపట్టారు. డీఏఓ, మండల విద్యాధికారికి వినతి పత్రాలు సమర్పించారు.
జర్నలిస్టు కుటుంబాల పిల్లలకు పాఠశాలల్లో ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ మిర్యాలగూడలో నిరసన ధర్నా చేపట్టారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) నల్లగొండ జిల్లా కమిటీ పిలుపుమేరకు సోమవారం జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కలిమెల నాగయ్య, టీయూడబ్ల్యూజే జిల్లా ప్రచార కార్యదర్శి ఎండి. అస్లాంల ఆధ్వర్యంలో మిర్యాలగూడ టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఈ ధర్నా జరిగింది.
ఈ సందర్భంగా కార్యాలయ డీఏఓ శ్రీనివాస శర్మ, మండల విద్యాధికారి ధర్మానాయక్ లకు వినతి పత్రాలు సమర్పించారు. ఫీజు రాయితీ సర్కులర్ జారీ చేసేంతవరకు ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డివిజన్ టీయూడబ్ల్యూజే (ఐజేయు) అధ్యక్షులు బాలాజీ రావు, ప్రధాన కార్యదర్శి రమేష్, సీనియర్ జర్నలిస్టులు నామిరెడ్డి నరేందర్ రెడ్డి, ఖాజా నాజీముద్దిన్, సుమన్, కిషోర్, జిల్లా ప్రచార కార్యదర్శి కాతోజు నాగ చారి, బండ వేణుగోపాల్ రెడ్డి, అశోక్, రాచకొండ రమేష్, సునీల్ చౌదరి, కిషోర్, శీను, కాట్రాజ్ అశోక్, నక్క శ్రీను, వెంకన్న, హరీష్ బాబు, తోఫిక్, కట్ట బాబు, షేక్ వసీం, రాయించు నగేష్ తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.











