రాజాపూర్, జూలై 25
రాజాపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినుల విద్యాభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానంలో వారిని ముందంజలో నిలపడానికి జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారి కుమారుడు హితేష్ రెడ్డి తన మిత్ర బృందంతో కలిసి పాకెట్ మనీతో కంప్యూటర్లు, లైబ్రరీ పుస్తకాలను అందజేశారు. విద్యార్థినులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విద్యార్థినులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తూ సాంకేతిక పరిజ్ఞానంలోనూ ముందంజలో నిలవాలనే లక్ష్యంతో రాజాపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారి కుమారుడు హితేష్ రెడ్డి మిత్ర బృందం పాకెట్ డబ్బు (Pocket money) సొంత నిధులతో కంప్యూటర్లు మరియు లైబ్రరీ పుస్తకాలను విద్యార్థినులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యే సమాజ అభివృద్ధికి మూలాధారమని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యా వసతులు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కంప్యూటర్ పరిజ్ఞానం నేటి పోటీ ప్రపంచంలో అత్యంత అవసరమని, విద్యార్థినులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
అదేవిధంగా పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెంపొందుతుందని, లైబ్రరీలను సమర్థవంతంగా వినియోగించుకొని విద్యలో రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులకు ఆకాంక్షించారు.
పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యాభివృద్ధికి అందిస్తున్న సహకారం విద్యార్థినులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.












