విలాసాగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 29
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూలై 6న పూర్వ విద్యార్థుల సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి పాఠశాల ఆవరణలో సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూలై 6న నిర్వహించనున్న పూర్వ విద్యార్థుల సమావేశాన్ని విజయవంతం చేయడానికి సోమవారం పాఠశాల ఆవరణలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ ఎనుగుల కనకయ్య, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, కార్యదర్శి గడప కోటేష్ కుమార్, రుద్ర ఆంజనేయులు, కొండ రాజయ్య, పంజాల వెంకటేశ్వర్లు, డి. మొండయ్య, మారం ఉపేందర్, బండారి రాములు, మాజీ సర్పంచ్ జగ్గారావుపల్లి శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జూలై 6న జరిగే పూర్వ విద్యార్థుల సమావేశానికి అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల అవసరాలు, క్రీడా సామగ్రి పంపిణీ, విద్యార్థులకు అవసరమైన సహాయ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. పాఠశాల అభివృద్ధికి ప్రతి పూర్వ విద్యార్థి తమ వంతు సహకారం అందించాలని నిర్వాహకులు కోరారు.











