మిర్యాలగూడ, జూన్ 28
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 30న చేపట్టిన కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 30న చేపట్టిన కళాశాలల బంద్ విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపునిచ్చారు.
ఆదివారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునివ్వడం జరిగిందన్నారు.
మూడేళ్లుగా ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్లు చెల్లించకపోవడంతో, చదువు పూర్తయినప్పటికీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వక ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో హైకోర్టు సైతం విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేసుకోమని యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించడం సిగ్గుచేటన్నారు.
తక్షణమే బకాయి ఫీజులను విడుదల చేయని పక్షంలో సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీసీ కో కన్వీనర్ చేగొండి మురళి యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్క నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు రవీందర్ గౌడ్, బీసీ జేఏసీ కన్వీనర్ దాసరాజు తదితరులు పాల్గొన్నారు.












