భైంసా, జూన్ 29
ముధో మండ కేందరంోని పరభుతవ ఎససీ, ఎసటీ బాిక వసతి గృహంో నెకొనన సమసయను వెంటనే పరిషకరించి, నూతన శాశవత భవన నిరమాణానికి నిధుు మంజూరు చేయాని విదయారథి సంఘాు డిమాండ చేశాయి. ఈ మేరకు సోమవారం భైంసా డివిజన ఉప కెకటర అజమీరా సంకేత కుమారను కిసి వినతిపతరం అందజేశారు.
ముధోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, నూతన శాశ్వత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ మేరకు సోమవారం భైంసా డివిజన్ ఉప కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆదివాసి ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి గడపాలే పరమేష్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వాగ్మారే మహేందర్ మాట్లాడుతూ, పాత వసతి గృహ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో విద్యార్థినులను తాత్కాలికంగా ప్రైవేట్ భవనానికి తరలించినప్పటికీ, ఇప్పటివరకు నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు కాకపోవడం బాధాకరమన్నారు.
ప్రస్తుతం 50 నుంచి 70 మంది విద్యార్థినులు ఇరుకైన గదుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మరుగుదొడ్లు, స్నానాల గదులు, సరైన వసతి వంటి కనీస సౌకర్యాలు లేక విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ముధోల్ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహానికి వెంటనే నిధులు మంజూరు చేసి నూతన భవనం నిర్మించాలి. కొత్త భవనం పూర్తయ్యే వరకు విద్యార్థినులను అన్ని సౌకర్యాలు ఉన్న విశాలమైన భవనంలోకి తరలించాలి. విద్యార్థినుల విద్య, ఆరోగ్యం, భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అత్యవసర చర్యలు తీసుకోవాలి.
విద్యార్థి సంఘాల వినతిపై స్పందించిన ఉప కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ సమస్యను పరిశీలించి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకుడు లంబాడి రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.












