ముధోల్, 2026-08-31
పుస్తక పఠనం ద్వారానే జ్ఞానం వృద్ధి చెందుతుందని, పోటీ పరీక్షలకు ఇది ఎంతో అవసరమని రబింద్రా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆసంవార్ సాయినాథ్ అన్నారు. ముధోల్‌కు చెందిన విశ్రాంత అధ్యాపకుడు సారథి రమేష్ రచించిన ఆంగ్ల వ్యాకరణ పుస్తకాన్ని పాఠశాలలో ఆవిష్కరించారు.
పుస్తక పఠనంతోనే జ్ఞానం పెంపొందుతుందని రబింద్రా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆసంవార్ సాయినాథ్ అన్నారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా యువతకు సులభంగా అర్థమయ్యే రీతిలో ముధోల్‌కు చెందిన విశ్రాంత అధ్యాపకుడు, ఆంగ్ల భాషా నిపుణుడు సారథి రమేష్ రచించిన ఆంగ్ల వ్యాకరణ పుస్తకాన్ని సోమవారం పాఠశాలలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఆంగ్ల వ్యాకరణంపై పట్టు సాధించడం ఎంతో అవసరమన్నారు. సాధారణ భాషలో యువతకు సులభంగా అర్థమయ్యేలా సారథి రమేష్ పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయం అన్నారు. ఇది విద్యార్థులకు, యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయులు పుస్తక పఠనం ద్వారా అపారమైన జ్ఞానాన్ని సంపాదించి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. వారి ఆలోచనలు, ఆశయాలను తెలుసుకుని వారి మార్గంలో నడవాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడం అవసరమన్నారు. చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే ఆలోచనా శక్తి, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం పెరుగుతాయని చెప్పారు. యువత ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పుస్తకాలు చదవాలని సూచించారు.
ఆనంతరం పుస్తక రచయిత సారథి రమేష్‌ను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












