బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
మండల కేంద్రంలోని నాగభూషణం మెమోరియల్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో పాఠశాలకు హాజరై సందడి చేశారు. చిన్నారుల వేషధారణలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
నాగభూషణం మెమోరియల్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు మండలం సెప్టెంబరు 4 (మనోరంజని తెలుగు టైమ్స్) మండల కేంద్రంలోని నాగభూషణం మెమోరియల్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో పాఠశాలకు హాజరై సందడి చేశారు. చిన్నారుల వేషధారణలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కిషోర్‌కుమార్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి జీవితం విద్యార్థులకు ధర్మం, నీతి, సత్యం, ధైర్యం వంటి విలువలను నేర్పుతుందని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడమే ఇటువంటి కార్యక్రమాల ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












