బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 06
బోథ్ మండలంలోని గ్రామ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫాంలను గ్రామ సర్పంచ్ మైలి నారాయణ, ఉపసర్పంచ్ సుద్దుల అరుణ్ రెడ్డి, అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు కీలకమని, ప్రభుత్వం నాణ్యమైన విద్య, పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తోందని తెలిపారు.
బోథ్ మండలంలోని గ్రామ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫాంలను గ్రామ సర్పంచ్ మైలి నారాయణ, ఉపసర్పంచ్ సుద్దుల అరుణ్ రెడ్డి, అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం, ఆరోగ్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు చిన్నారులను ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాలకు పంపించి ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












