Union) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 13
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్ నిధులను తక్షణమే విడుదల చేయాలని AIPSU (All India Progressive Students' Union) మరియు వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 14న హైదరాబాద్లో "చలో సచివాలయం" ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. జూలై 14న హైదరాబాద్లో చేపట్టే "చలో సచివాలయం" ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని AIPSU (All India Progressive Students' Union) జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ మరియు వామపక్ష విద్యార్థి సంఘాలు సంయుక్తంగా విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్స్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను సాకుగా చూపిస్తూ, కోర్సులు పూర్తయిన విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని మండిపడ్డారు. ఉన్నత చదువులకు వెళ్లాలన్నా, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా సర్టిఫికేట్లు లేక విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని అన్నారు.
ఫీజు బకాయిల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేయకుండా విద్యాశాఖ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల చదువుకునే హక్కును, వారి భవిష్యత్తును కాపాడుకోవడానికి AIPSU మరియు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు జూలై 14న నిర్వహించే "చలో సచివాలయం" పోరాటంలో బైంసా నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులు, యువకులు మరియు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో AIPSU నాయకులు వాగ్మారే ప్రతాప్, శీతల్కర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్ నిధులను తక్షణమే విడుదల చేయాలి.
ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను యాజమాన్యాలు వెంటనే అందజేసేలా ప్రభుత్వం కఠిన ఉత్తర్వులు జారీ చేయాలి.
సర్టిఫికేట్ల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతూ, అక్రమ వసూళ్లకు పాల్పడే కాలేజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.












