ఆలయం లో దొంగతనం పై సమగ్ర దర్యాప్తు చేయండి
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
భైంసా : అక్టోబర్ 20
నిర్మల్ జిల్లా భైంసా లోని లక్ష్మీ నరసింహ ఆలయం లో జరిగిన దొంగతనం పై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పోలీసు అధికారులకు సూచించారు. అధికారులతో ఫోన్ మాట్లాడి దొంగతనం జరిగిన విషయమై ఆరా తీశారు.. అదే విధంగా ఎస్. పి. జానకి షర్మిల, ఎ. ఎస్. పి. అవినాష్ కుమార్ తో ఫోన్లో మాట్లాడారు..ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులను వెంటనే పట్టుకోవాలని కోరారు.. ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరిపితే దోషులు ఎవరో తేలిపోతుందన్నారు.. ఆలయాల్లో దొంగతనం జరగడం మంచిది కాదని, ఇలాంటి సంఘటనలు జరగకుండా దృష్టి సారించాలని పోలీసులను కోరారు..