మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 30
మామడ మండలం పొంకల్ గ్రామంలోని పెద్దమ్మ ఆలయం వద్ద నూతన బోరు బావిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ పీఏసీఎస్ చైర్మన్ కాలగిరి గంగారెడ్డి కొబ్బరికాయ కొట్టి బోరును ప్రారంభించారు.

అనంతరం పెద్దమ్మ ఆలయ అభివృద్ధికి రూ.20 వేల విరాళాన్ని అందజేశారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని గంగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్ల నరేష్, తాళ్లపల్లి శేఖర్, సల్కం ప్రశాంత్, దొరగారి లక్ష్మణ్, తాళ్లపల్లి రాజు, గంగారెడ్డి, కోరుట్ల లక్ష్మణ్, కొత్తపల్లి గంగన్న, కోరుట్ల గంగన్న, అర్చకుడు రవి తదితరులు పాల్గొన్నారు.