లోకేశ్వరం, 3 September
మండలం వేదం పాఠశాల, లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి బాల్య లీలలు, గోపికా వేషధారణలతో విద్యార్థులు అలరించారు. కృష్ణుని వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మండలంవేదం పాఠశాల, లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ( మనోరంజని తెలుగు టైమ్స) శ్రీకృష్ణుడి బాల్య లీలలు, గోపికా వేషధారణలతో విద్యార్థులు అలరించారు. కృష్ణుని వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాఠశాల ఆవరణలో భక్తి, ఆనందోత్సాహాల మధ్య వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. విద్యార్థులకు శ్రీకృష్ణుడి జీవిత సందేశాలు, ధర్మం, సత్యం, ప్రేమ, మానవతా విలువల గురించి ఉపాధ్యాయులు వివరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ దాడిగే రమేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.












