నిర్మల్, జులై 29
గురు పౌర్ణమి (వ్యాస పూర్ణిమ) పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలోని శ్రీ గండి రామన్న దత్త సాయి ఆలయంలో బుధవారం అత్యంత వైభవంగా వేడుకలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి, బాబాను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో అలరారింది.
గురు పౌర్ణమి (వ్యాస పూర్ణిమ) పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ గండి రామన్న దత్త సాయి ఆలయంలో బుధవారం వేడుకలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామున పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య బాబాకి పంచామృతాభిషేకాలు, కుంకుమ అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. బాబాను వివిధ రకాల సుగంధ పుష్పాలు, పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
సద్గురు సాయినాథుని దర్శించుకుని, ఆశీస్సులు పొందేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణం 'ఓం సాయి.. శ్రీ సాయి.. జైజై సాయి' నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
మధ్యాహ్న హారతి అనంతరం బాబా ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని భక్తిభావంతో స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.












