నిర్మల్, 2026-09-16
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయం వద్ద వివిధ దుకాణ సముదాయానికి బహిరంగ వేలం పాట నిర్వహించనున్నారు. ఈ వేలంపాట 08.09.2026 (మంగళవారం) ఉదయం 11 గంటలకు జరగనుంది. ఆలయ ఈవో భూమయ్య ఈ వివరాలను ఒక ప్రకటనలో తెలిపారు.
పోచమ్మ దుకాణ సముదాయానికి వేలం. సారంగాపూర్ నిర్మల్ జిల్లా,సారంగాపూర్ : మండలంలోని ప్రసిద్ధి గాంచిన ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయ వద్ద మంగళవారం వివిధ దుకాణాల సముదాయానికి బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భూమయ్య ఒక ప్రకటన లో తెలిపారు. వేలములు (1) కొబ్బరికాయలు అమ్ముకునే హక్కు (2) ప్యాలాలు, పుట్నాలు అమ్ముకునే హక్కు (3) బొమ్మలు, కంకణాలు, సిడిలు, ఫోటోలు అమ్ముకునే హక్కు (4) టోల్ టాక్స్ వసూలు చేసుకునే హక్కు కాల పరిమితి అనగా తేది 16.09.2026 నుండి 15.09.2027 వరకు గాను మరియు (5) ఇడుపుడు పిల్ల మేకలు సేకరించుకునే హక్కు (6) కొబ్బరి ముక్కలు ప్రోగుచేసుకునే హక్కు (7) పూలదండలు అమ్ముకునే హక్కు (8) ఇతరముల కాల పరిమితి అనగా తేది: 09.09.2026 నుండి 08.09.2027 వరకు గాను మరియు (9) తైబజార్ వసూలు హక్కు కాల పరిమితి 21.09.2026 నుండి 20.09.2027 వరకు గాను, తేది: 08.09.2026 (మంగళ వారము) రోజున ఉదయం 11.00 గం॥లకు బహిరంగ వేలం పాటలో ఆసక్తిగల వారు పొల్గొనవలసినదిగా కోరారు. ఇతర వివరములకు దేవస్థాన కార్యాలయములో సంప్రదించగలరు.












