రంగారెడ్డి, 11 July
షాబాద్ మండలం దైవాలగూడలో తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన రాజ్ కుమార్ (28) అనే వ్యక్తిపై మే 16న బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. మే 26న అరెస్ట్ అయిన నిందితుడు, ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చి, తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఆరుగురిని దారుణంగా హత్య చేశాడు.
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. షాబాద్ మండలం దైవాలగూడలో తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన రాజ్ కుమార్ (28) అనే వ్యక్తిపై మే 16వ తేదీన బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. మే 26వ తేదీన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఇటీవల బెయిల్పై తిరిగి వచ్చిన రాజ్ కుమార్, తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో దారుణానికి ఒడిగట్టాడు.
కేసు పెట్టిన బాలికతో పాటు, బాలిక తల్లి, బాలిక నానమ్మలు, తన భార్య సరిత, తన ఇద్దరు పిల్లలను రాజ్ కుమార్ హతమార్చినట్లు సమాచారం. కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి రాజ్ కుమార్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












