SPSR Nellore/Jaladanki (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
గ్రామాల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరమని, వాటి ఏర్పాటుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఖానాపూర్ ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ పిలుపునిచ్చారు. దిలావర్పూర్ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాత ముద్దం సురేష్‌ను ఆయన సన్మానించి అభినందించారు.
ఖానాపూర్ గ్రామాల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వాటి ఏర్పాటుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఖానాపూర్ ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ పిలుపునిచ్చారు.
ఖానాపూర్ మండలం దిలావర్పూర్ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాత ముద్దం సురేష్‌ను ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ప్రతి గ్రామంలో యువత ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
గతంలోనూ దిలావర్పూర్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో చొరవ చూపిన ముద్దం సురేష్‌ను ఎస్ఐ అభినందించారు.
ఈ కార్యక్రమంలో దిలావర్పూర్ సర్పంచ్ చింతల మల్లేష్, ఉప సర్పంచ్ ఓరగంటి రాజేశ్వర్, దిలావర్పూర్ గౌడ సంఘం సొసైటీ అధ్యక్షుడు గుగ్గిళ్ల సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












