కడం (పెద్దూర్), 2026-07-25
కడడకేదోనిిఆయోిజిినదొనథనికవకకృషిచిది.ధిఆయోకిచొడినదడవిడోనిోనదొిిచ.ఉదయఆయనికివచచినచకఈవిషయననిిచిోకఫియదచేశ.
కడం మండల కేంద్రంలోని గంగమ్మ తల్లి ఆలయంలో రాత్రి జరిగిన చోరీ స్థానికంగా కలకలం రేపింది. దుండగులు రాత్రివేళ ఆలయంలోకి చొరబడి అమ్మవారి మెడలో ఉన్న బంగారు మంగళసూత్రంతో పాటు మెట్టెలను అపహరించారు. ఉదయం పూజల కోసం ఆలయానికి వచ్చిన అర్చకులకు నగలు కనబడకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.












