భైంసా, 28 July
భైంసా మండలం కోతుల్ గాంలో పూజల పేరుతో మోసాలకు పాల్పడి, వెండి ఆభరణాలు దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. భిక్షాటనకు వచ్చిన ఇద్దరు మహిళలు ఇంట్లోకి ప్రవేశించి, రోగాలు నయం చేస్తామని నమ్మించి బాధితురాలి నుండి విలువైన ఆభరణాలను అపహరించారు.
ఇంట్లో పూజలు చేస్తే రోగాలు నయమవుతాయని నమ్మించి, వెండి ఆభరణాలు దొంగిలించిన ఘటన భైంసా మండలం కోతుల్ గాంలో వెలుగుచూసింది. భిక్షాటనకు వచ్చిన శాంతాబాయి, సాయవ్వ అనే మహిళలు బాధితురాలు కవితను నమ్మించి, రూ.15 వేలు విలువ చేసే 5 తులాల వెండి కడియాలను అపహరించారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు.











