సారంగాపూర్, 4 September
మండల కురుమ సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం బీరప్ప దేవాలయం వద్ద ఎన్నుకున్నారు. ఎకలేరు గంగాధర్ అధ్యక్షుడిగా ఎన్నిక కాగా, భూమన్న, కాలువ నరేష్ గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. మండలంలోని కురుమ కులస్తుల ఐక్యత, అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపింది.
మండల కురుమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక అధ్యక్షుడిగా ఎకలేరు గంగాధర్.. గౌరవ అధ్యక్షులుగా భూమన్న, కాలువ నరేష్ మండల కేంద్రంలోని బీరప్ప దేవాలయం వద్ద శుక్రవారం మండల కురుమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కురుమ కులస్తులు, సంఘం నాయకులు, జిల్లా నాయకుల సమక్షంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా ఎకలేరు గంగాధర్, ఉపాధ్యక్షుడిగా ఒలికిరి నరేష్, కార్యదర్శిగా కామేటి భోజన్న, కోశాధికారిగా సాయిల నరసయ్య, సలహాదారుగా జెడ్ల మహేష్, సోషల్ మీడియా కన్వీనర్‌గా సూర్య సంతోష్ ఎన్నికయ్యారు.అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న, కాలువ నరేష్‌లను ఎన్నుకున్నారు.ఈ ఎన్నికల కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామాల కురుమ కులస్తులు, జిల్లా నాయకులు రాములు, చిన్నయ్య, దేవన్న, సట్ వాజి తదితరుల ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ మండలంలోని కురుమ కులస్తుల ఐక్యతకు, సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కురుమ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు అందరినీ కలుపుకొని సమష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు. మండలంలోని కురుమ కులస్తుల సంక్షేమం, ఐక్యత, అభివృద్ధి కోసం సంఘం తరఫున పలు కార్యక్రమాలు చేపట్టేందుకు నూతన కార్యవర్గం కృషి చేస్తుందని తెలిపారు.కురుమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక పట్ల మండలంలోని వివిధ గ్రామాల కురుమ కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.












