బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
మండలం సిద్ధూరు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న పనుల పురోగతి, గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు సంబంధించిన దరఖాస్తులను కూడా స్వీకరించారు.
సిద్ధూరులో ఉపాధి హామీ పనులపై గ్రామసభ , సెప్టెంబర్ 3 ( మండలం సిద్ధూరు గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనుల పురోగతి, గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.అలాగే ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు సంబంధించి నోటీసులు అందుకున్న వారి నుంచి సంబంధిత దరఖాస్తులను స్వీకరించారు. గ్రామస్థులు తమ సమస్యలు, అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామసభకు మండల అభివృద్ధి అధికారి నీరజ్‌కుమార్, ఉపాధి హామీ పథకం సాంకేతిక అధికారి రాజ్‌కుమార్, గ్రామ పంచాయతీ అధికారి స్వాతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి కైసర్ హాజరై గ్రామస్థులకు పలు సూచనలు చేశారు. ఉపాధి హామీ పనుల అమలులో గ్రామస్థుల భాగస్వామ్యం ముఖ్యమని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలేపు దుర్పతిబాయి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు, యువకులు, మహిళలు పాల్గొని గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.











