నిజామాబాద్, 2026-08-25
నిజామాబాద్ జిల్లా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శిగా బాలామణిని నియమించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు లక్ష్మణరావు మోరే ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర మాల్వేకర్ ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగినట్లు జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర తెలిపారు.

సేవా కార్యక్రమాల విస్తరణ
ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బాలామణి కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని ధర్మేంద్ర మాల్వేకర్ తెలిపారు.
అభినందనలు
ఈ నియామకానికి మనోరంజని తెలుగు టైమ్స్ ఎడిటర్ సూర్యవంశీ మాధవరావు పటేల్ ఆమోదం తెలిపారు. బాలామణికి పలువురు ఫౌండేషన్ సభ్యులు, నాయకులు అభినందనలు తెలిపారు.