చిలకలూరిపేట, 2026-06-05
శ్రావణమాసం సందర్భంగా చిలకలూరిపేట కేంద్రంగా పనిచేస్తున్న జయ జయ సాయి ట్రస్ట్, లీలావతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లావు సుష్మకు శ్రీ సాయి భారత శ్రావణ మంగళ గౌరీ వైద్య సేవా రత్న పురస్కారాన్ని అందజేసింది. ఈ పురస్కారాన్ని ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ అందజేశారు.
శ్రావణమాసం సందర్భంగా చిలకలూరిపేట కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ, ఐఎస్ఓ సర్టిఫైడ్, నీతి అయోగ్ గుర్తింపు పొందిన జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రావణమాసంలో వివిధ రంగాలలో విశేష కృషి చేస్తున్న మహిళలకు పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకొని లీలావతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లావు సుష్మకు శ్రీ సాయి భారత శ్రావణ మంగళ గౌరీ వైద్య సేవా రత్న పురస్కారాన్ని ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ అందజేశారు.
వైద్య సేవలకు గుర్తింపు
ఈ సందర్భంగా డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ, వైద్యో నారాయణో హరి అనే నానుడిని నిజం చేస్తూ రోగుల పాలిట ప్రత్యక్ష దైవంగా నిలుస్తున్నారని, నిరంతర సేవాదృక్పథంతో ముందుకు సాగుతూ, వైద్య వృత్తి ధర్మానికి నిస్వార్థ సేవ అందిస్తున్నారని తెలిపారు. సమాజ ఆరోగ్య రక్షణ ధ్యేయంగా, నిరుపేదల కన్నీరు తుడిస్తూ, వ్యాధి పీడితులకు పునర్జన్మను ప్రసాదిస్తూ, ఎంతోమంది సంతానలేమి సమస్యలతో బాధపడేవారికి సంతాన భాగ్యాన్ని కలిగిస్తూ, సేవా కార్యక్రమాల్లో ముందుండే డాక్టర్ సుష్మ చేస్తున్న నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఈ సాయి భారత శ్రావణ మంగళ గౌరీ వైద్య సేవ రత్న పురస్కారాన్ని అందజేస్తున్నామని తెలిపారు.
డాక్టర్ సుష్మ స్పందన
పురస్కారం అందుకున్న అనంతరం డాక్టర్ సుష్మా మాట్లాడుతూ, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జయ జయ సాయి ట్రస్ట్ సభ్యులు అభినందనీయులని, వారు మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.
కార్యక్రమ వివరాలు
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బందితో పాటు పట్టణ పుర ప్రముఖులు ముద్దుల ప్రసాద్, కల్లూరీ రాజలక్ష్మి, శివ లీలలు పాల్గొన్నారు.











