నగరి, 27 July
నగరి జాతీయ కాపు సంఘం అధ్యక్షుడు ఎంవీ బాబు, ఆయన అనుచరుల సహకారంతో స్థానిక చిల్డ్రన్స్ ఫర్ హోమ్ అనాధాశ్రమంలోని పిల్లలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సహాయాన్ని అందించారు.
నగరి జాతీయ కాపు సంఘం అధ్యక్షుడు ఎంవీ బాబు, ఆయన అనుచరుల ఆధ్వర్యంలో నగరి మండపం వద్ద ఉన్న చిల్డ్రన్స్ ఫర్ హోమ్ అనాధాశ్రమంలోని పిల్లలకు నూతన వస్త్రాలు అందజేశారు. జాతీయ కాపు సంఘం సభ్యుల్లో ఒకరైన ఎన్సీ శేఖర్ మాట్లాడుతూ, నగరి నియోజకవర్గంలో ఎంవీ బాబు ఆధ్వర్యంలో ప్రతిరోజు, ప్రతివారం, ప్రతి నెలా ఏదో ఒక సామాజిక కార్యక్రమం నిర్వహించడం సామాజిక వర్గానికి గర్వకారణమని కొనియాడారు.
గతవారం ఎంవీ బాబు అనుచరుల్లో ఒకరైన గాలి అయ్యప్ప రాయల్, తిరుపతి-చెన్నై రహదారిలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న నాగాలమ్మ ఆలయానికి సూలం సమర్పించినట్లు తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు, అనాధాశ్రమాల్లోని పిల్లలకు పుస్తకాలు, బియ్యం వంటి సహాయ కార్యక్రమాలు అందించడంలో ఎప్పుడూ ముందుంటారని కాపు సామాజిక వర్గ సభ్యుడు మణికంఠ తెలిపారు.
ఈ నూతన వస్త్రాలు అందజేసే కార్యక్రమంలో గాలి అయ్యప్ప రాయల్, గాలి గాంధీ రాయల్, గాలి రాధాకృష్ణ రాయల్, వేలు రాయల్, మనీ రాయల్ పాల్గొన్నారు.











