లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు వనిత డైమండ్ క్లబ్ ఆధ్వర్యంలో, డైమండ్ నేత్రనిధి వ్యవస్థాపకులు లయన్ మాశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా వీధి వ్యాపారులకు గొడుగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఆదివారం మిర్యాలగూడలో జరిగింది.
లయన్ మాశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ 10 ఆర్.సి. సిల్వర్ స్టార్ కేజీ జిఎఫ్ శ్యామ్, వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ మధు స్వప్న, సామా శ్రీనివాస్, పంపటి రామలింగయ్య, గట్టు వెంకటేశ్వర్లు, సోమ వెంకటేశ్వర్లు, మరియు పలు క్లబ్‌ల మాజీ అధ్యక్షులు కలిసి డైమండ్ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్రూట్స్ కట్ చేశారు.
ఈ పుట్టినరోజు వేడుకలకు బాలాజీ రెసిడెన్సి దీన్ దయాల్ మేనక, వెంకటేశ్వర్లు, ధనలక్ష్మి, అనంత రాములు, పద్మ, వేదశ్రీ జ్యువెలర్స్ సంతోష్, లిఖిత, ఇంటర్నేషనల్ చెస్ క్రీడాకారిణి దివ్యశ్రీ వంటి ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.
పుట్టినరోజు వేడుకలతో పాటు, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు వనిత డైమండ్ క్లబ్ డిస్టిక్ 320 ఈ ఆధ్వర్యంలో ఒక సామాజిక కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, స్థానిక వీధి వ్యాపారులకు అవసరమైన గొడుగులను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మాశెట్టి శ్రీనివాస్ డైమండ్, మాశెట్టి గీత, వాసవి క్లబ్ రీజియన్ 10 ఆర్ సి ఓరుగంటి శ్యాంసుందర్, డిస్టిక్ ఇంచార్జ్ సామ శ్రీనివాస్, డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ పూరి శంకరయ్య, సెక్రటరీ ముచ్చర్ల నాగరాజు, గార్లపాటి సువర్ణ, లింగం కపుల్స్ క్లబ్ సభ్యులు గుండా రవి గుప్త దంపతులు, చీదళ్ళ శ్రీనివాస్ దంపతులు వంటి పలువురు పాల్గొన్నారు.











