సోనాల మండలంలో 135వ డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకలు మండల మహర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి, ఆయనకు నివాళులర్పించిన అనంతరం, ఆడే గజేందర్ మాట్లాడుతూ అంబేడ్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా, సమానత్వానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ ఆలోచనలు నేటికీ మార్గదర్శకంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విద్య, సమాన హక్కులు, సామాజిక న్యాయం సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, యువత అంబేడ్కర్ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మహర్ సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలు అంబేడ్కర్ ఆశయాలను స్మరించుకోవడానికి దోహదపడ్డాయి.











