సికింద్రాబాద్, 4 September
స్వాతంత్ర్య సమరయోధుడు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 125వ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి ఉపాధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కొరివి కృష్ణస్వామి ముదిరాజ్‌కు ఘన నివాళి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసిన డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ సికింద్రాబాద్, సెప్టెంబరు 4: శ్రీ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ శాసనమండలి ఉపాధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు, సమాజం కోసం చేసిన కృషిని కొనియాడారు. ముదిరాజ్ సమాజ అభివృద్ధి, ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు, ముదిరాజ్ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి సందర్భంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.











