కంటేశ్వర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
కంటేశ్వర్ బస్తీలో మాదిగ కుల పెద్దలతో ఎంఆర్పీఎస్ఎంఎస్పీ అర్బన్ ఇన్చార్జి సరికేల పోశెట్టి మాదిగ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బస్తీలో నూతన కమిటీ ఏర్పాటు అంశంపై చర్చించారు. ఈ నెల 6న ఆదివారం నూతన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు నాయకులు తెలిపారు.
కంటేశ్వర్లో ఎంఆర్పీఎస్–ఎంఎస్పీ నూతన కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు
నిజామాబాద్ అర్బన్, సెప్టెంబరు 2: కంటేశ్వర్ బస్తీలో మాదిగ కుల పెద్ద మనుషులతో ఎంఆర్పీఎస్–ఎంఎస్పీ అర్బన్ ఇన్చార్జి సరికేల పోశెట్టి మాదిగ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీలో నూతన కమిటీ ఏర్పాటు అంశంపై చర్చించారు.
ఈ నెల 6న ఆదివారం ఉదయం 12 గంటలకు పాత అంబేడ్కర్ భవన్లో టౌన్ కమిటీ సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు నాయకులు తెలిపారు. అనంతరం కంటేశ్వర్ బస్తీలో కమిటీలు ఏర్పాటు చేసి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. బస్తీ కమిటీల ఏర్పాటుకు కుల సంఘ పెద్దలు తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్–ఎంఎస్పీ అర్బన్ ఇన్చార్జి సరికేల పోశెట్టి మాదిగ హాజరయ్యారు. పెదగిరి మహేశ్ మాదిగ అధ్యక్షత వహించారు. సుధాకర్ మాదిగ, జై నాగేష్, భూమయ్య, బాలరాజు, ప్రవీణ్ కుమార్, నాగేష్, మహిళా సమైక్య కోర్ కమిటీ సభ్యులు పెద్దల యమున, యాదవ తదితరులు పాల్గొన్నారు.












