తానూరు (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 17
విప్లవ రచయిత, సాహిత్యరత్న డాక్టర్ అన్నాభావూ సాఠే వర్ధంతి కార్యక్రమాన్ని జూలై 18న తానూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అన్నాభావూ సాఠే కమిటీ సభ్యుడు గాయకవాడ్ సాయినాథ్ (ఝరి) తెలిపారు. అణగారిన వర్గాల చైతన్యం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు.
మహాత్మా జ్యోతిరావ్ పూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలతో సమాజ మార్పు కోసం, శ్రామిక, బహుజన ప్రజల హక్కుల కోసం తన కలంతో పోరాడిన విప్లవ రచయిత, సాహిత్యరత్న డాక్టర్ అన్నాభావూ సాఠే వర్ధంతి కార్యక్రమాన్ని జూలై 18న తానూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అన్నాభావూ సాఠే కమిటీ సభ్యుడు గాయకవాడ్ సాయినాథ్ (ఝరి) తెలిపారు.
శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, అణగారిన వర్గాల చైతన్యం కోసం డాక్టర్ అన్నాభావూ సాఠే చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ నిర్వహించే వర్ధంతి కార్యక్రమానికి తాలూకా పరిధిలోని మాదిగ సమాజం, బహుజన బంధువులు, దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మహనీయుడికి ఘన నివాళులు అర్పించాలని గాయకవాడ్ సాయినాథ్ కోరారు.












