బోత్, జూలై 16
బోథ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పురుషోత్తం జన్మదినాన్ని పురస్కరించుకుని బోథ్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు మేరుగు భోజన్న సారథ్యంలో ఎస్ఐ ని సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
బోథ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పురుషోత్తం జన్మదినాన్ని పురస్కరించుకుని బోథ్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అధ్యక్షులు మేరుగు భోజన్న ఆధ్వర్యంలో ఎస్ఐ ని శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మేరుగు భోజన్న మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ పురుషోత్తం మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శివ మార్కండేయ ఆలయ అధ్యక్షులు సిరిపురం చందు, జిల్లా కమిటీ సభ్యుడు కోమరి దయాకర్, ఉపాధ్యక్షులు తడక పోశెట్టి, కోశాధికారి కటకం నగేష్, ఆడెపు ప్రసాద్, సభ్యులు ఉసికెల కార్తీక్, మహేశ్వర్ ప్రసాద్, ఆడెపు కిరణ్, కట్కూరి గంగాధర్, కట్కూరి వంశీ తదితరులు పాల్గొన్నారు.












