ఖానాపూర్, జూలై 26
నిర్మల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో లోకమాన్య పరస్పర సహాయక పొదుపు మరియు పరపతి సహకార సంఘం మూడవ సర్వసభ్య సమావేశం (మహాసభ) ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో సంఘం ఆర్థిక, సామాజిక కార్యక్రమాలతో పాటు నూతన పాలకవర్గ ఎన్నికలు జరిగాయి. భూసారపు గంగాధర్ వరుసగా నాలుగోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
లోకమాన్య పరస్పర సహాయక పొదుపు మరియు పరపతి సహకార సంఘం మూడవ సర్వసభ్య సమావేశం (మహాసభను) ఆదివారం ఉదయం పది గంటలకు నిర్మల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆదిలాబాద్ ఇప్ప ముత్యం రెడ్డి గారు హాజరై ప్రసంగించారు.
విశిష్ట అతిథులుగా సహకార భారతి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యెక్కటి ఉపేందర్ రెడ్డి గారు, అతిథులుగా చార్టెడ్ అకౌంటెంట్ నిర్మల్ ముక్క సాయి ప్రసాద్ గారు, సహకార భారతి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల సంఘటన ప్రముఖ్ పొన్నాల యాదగిరి గారు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్మల్ జిల్లా సంఘచాలక్ నూకల విజయ్ కుమార్ గారు, పెద్దల కమిటీ సభ్యులు నార్లపురం రవీందర్ గారు, మంచిరాల నాగభూషణం గారు హాజరై ప్రసంగించారు.
లోకమాన్య సహకార సంఘం అధ్యక్షులు భూసారాపు గంగాధర్ గారు సంఘ నిర్వహణ, సంఘం ఆధ్వర్యంలో పేద, మధ్య తరగతి వారికి చేస్తున్నటువంటి ఆర్థిక, సామాజిక కార్యక్రమాల గురించి వివరించారు. సంఘం ప్రారంభించిన మూడు సంవత్సరాల లోనే 600 మంది సభ్యులతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో నాలుగున్నర లక్షల లాభాలను అర్జించినట్లు వారు తెలియజేశారు.
అనంతరం ఎన్నికల అధికారి కందూరి శంకర్ 2026-27 సంవత్సరానికి నూతన పాలకవర్గ సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. నూతన డైరెక్టర్లుగా చిప్ప ప్రమోద్, శేరే వ్యాస్, మూర్తి అనిత, కుంట అన్నపూర్ణ, దేశ్కర్ భీమ్రావు లు ఇకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
వరుసగా నాలుగవసారి చైర్మన్గా శ్రీ భూసారపు గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వారు ప్రకటించారు. సెక్రటరీగా మహాజన్ సతీష్, క్యాషియర్ గా అన్నం వాసుదేవరెడ్డి, జాయింట్ సెక్రటరీగా మైసర్ల వెంకటరమణ, జాయింట్ ట్రెజరర్ గా జతల శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఇతర డైరెక్టర్లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.












